గ్రామ వాలంటీర్ సమాచారం మేరకు విశాఖ జిల్లా పద్మనాభం మండలం కొత్తకొవ్వాడ గ్రామంలోని మామిడి తోటలో నాటు సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ పోలీసులు 30లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలం నుంచి మరో ముగ్గురు పరారయ్యారని, సారా తయారీ దారులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి