ETV Bharat / state

MAOISTS BANDH: నేడు బంద్​కు మావోయిస్టుల పిలుపు.. మన్యంలో ముమ్మర తనిఖీలు - మావోయిస్టుల పిలుపుతో పోలీసుల తనిఖీలు

జులై 1న మావోయిస్టులు బంద్​కు పిలుపు(MAOISTS CALL FOR BANDH) నేపథ్యంలో విశాఖ మన్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈనెల 16న తీగలమెట్ట ఎన్​కౌంటర్​లో ఆరుగురు మావోయిస్టులు మృతికి నిరసనగా మావోలు బంద్​కు పిలుపునిచ్చారు. దీంతో సీఆర్‌పీఎఫ్ జవాన్​లు.. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని ఆరా తీస్తున్నారు.

police raids at visakha agency
మావోయిస్టుల పిలుపుతో పోలీసుల తనిఖీలు
author img

By

Published : Jun 30, 2021, 3:09 PM IST

Updated : Jul 1, 2021, 3:13 AM IST

రేపు బంద్​కు మావోయిస్టుల పిలుపు.. మన్యంలో ముమ్మర తనిఖీలు

జూన్ 16వ తేదీన ఏవోబీలోని(AOB) తీగలమెట్టలో జరిగిన దాడిని ఖండిస్తూ జూలై 1 తేదీన జోన్ వ్యాప్తంగా మావోయిస్ట్ పార్టీ బంద్​కు (MAOISTS CALL FOR BANDH)పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో విశాఖ మన్యంలో వాహనాల తనిఖీ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. కొయ్యూరు, మంప పోలీస్ స్టేషన్​ల పరిధిలోని అన్ని గ్రామాల్లో సీఆర్‌పీఎఫ్ జవాన్లు జల్లెడ పడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిపై ఆరా తీస్తున్నారు. ఓ పక్క బంద్.. మరోపక్క పోలీసుల తనిఖీలు..మన్యంలో ఎప్పుడు ఎం జరుగుతుందోనని గిరిజనులు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని గడుపుతున్నారు.

సీఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారుల పర్యటన..

police raids at visakha agency
విశాఖ మన్యంలో పోలీసులు తనిఖీలు

మ‌న్యంలో సీఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారులు అద‌న‌పు డీజీ ర‌ష్మీ శుక్లా, ఐజీ మ‌హేశ్‌ చంద్ర లడ్డా నేతృత్వంలో అధికారుల మంగళవారం పర్యటించారు. మావోలు జులై 1న బంద్​కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అధికారుల పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. అన్నవ‌రం, చింత‌ప‌ల్లి, జి.మాడుగులలోని సీఆర్‌పీఎఫ్ క్యాంపుల‌ను పరిశీలించారు. మన్యంలోని పరిస్థితులపై సీఆర్‌పీఎఫ్ జవాన్లతో సమీక్షించిన ఉన్నతాధికారులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జవాన్లకు పలు సూచనలు చేశారు.

ఆరుగురు మావోయిస్టులు మృతి..

జూన్​ 16న తీగలమెట్ట ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా..మరికొంత మంది మావోయిస్టులు గాయాలతో తప్పించుకున్నారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎదురుకాల్పులు అనంత‌రం..విశాఖ‌-తూర్పు ఏజెన్సీలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మావోయిస్టు స్థావ‌రాలపై నిఘా పెంచారు. గ‌త నెల‌లో పాల‌స‌ముద్రం వ‌ద్ద జ‌రిగిన ఎదురుకాల్పుల సంఘ‌ట‌న నుంచి మావోయిస్టులు త‌ప్పించుకున్న‌ప్ప‌టికీ..అక్క‌డ ల‌భించిన స‌మాచారం తీగలమెట్ట వద్ద మావోలను అంతమొందించి విజయం సాధించారు. తాజాగా మావోయిస్టులు బంద్​కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఇదీ చూడండి...

'న్యాయంగా బాధ్యతలు నిర్వహిస్తే.. బదిలీలా?'

Last Updated : Jul 1, 2021, 3:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.