ETV Bharat / state

నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు..

author img

By

Published : May 25, 2021, 7:25 AM IST

నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బెల్లం పులుసును ధ్వంసం చేశారు.

illegal liquor
నాటుసారా స్థావరాలపై దాడులు

విశాఖ జిల్లా గుండుబాడు శివారు బలిజిపాలెం, కశిరెడ్డిపాలెం గ్రామాల్లోని జీడితోటల్లో నిర్వహిస్తున్న నాటుసారా స్థావరంపై రోలుగుంట పోలీసులు సోమవారం దాడులు జరిపారు. ఈ దాడుల్లో 1700 లీటర్ల పులుపును ధ్వంసం చేసినట్లు ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్లాస్టిక్‌ డ్రమ్ములు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితులు పరారయ్యారని పేర్కొన్నారు.

దేేవరాపల్లి మండలంలోని బొడ్డపాడు, ముకుందపురం గ్రామాల్లో నాటుసారా తయారీకి సిద్ధం చేసిన రెండు వేల లీటర్ల బెల్లం పులుపును ధ్వంసం చేసినట్లు ఎస్సై సింహాచలం సోమవారం చెప్పారు. బొడ్డపాడు పొలిమేరల్లో నాటుసారా తయారు చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడులు చేశామన్నారు.

ఇదీ చదవండీ.. రాష్ట్రంలో చాప కింద నీరులా విస్తరిస్తున్న బ్లాక్ ఫంగస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.