ETV Bharat / state

THIEVES ATTACK ON POLICE: గోపాలపట్నంలో దొంగలు హల్​చల్... పోలీసులపై ఎదురుదాడి - విశాఖ జిల్లాలో దొంగలు హల్ చల్

విశాఖ జిల్లా గోపాలపట్నంలో దొంగలు హల్​చల్ చేశారు. పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపైకి దాడికి యత్నించారు. ఈ ఘటనలో హోంగార్డుకు గాయాలయ్యాయి. చివరకు స్థానికుల సహాయంతో నిందితులను పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గోపాలపట్నం పోలీస్ స్టేషన్
గోపాలపట్నం పోలీస్ స్టేషన్
author img

By

Published : Nov 25, 2021, 11:23 AM IST

Updated : Nov 25, 2021, 1:12 PM IST

గోపాలపట్నంలో దొంగల హల్​చల్... పోలీసుల పై ఎదురుదాడి

THIEVES ATTACK ON POLICE: విశాఖ జిల్లా గోపాలపట్నంలో నలుగురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వారిని పట్టుకోవటానికి ప్రయత్నించిన పోలీసులపై తిరగబడ్డారు. చివరకు స్థానికుల సాయంతో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో హోంగార్డుకు గాయాలు కాగా.. అతడిని ఆస్పత్రికి తరలించారు.

అసలు ఏం జరిగిందంటే...

సింహాచలం నుంచి వస్తున్న ఆటోను విరాట్ నగర్​లో నలుగురు వ్యక్తులు ఆపి ఎక్కారు. గోపాలపట్నం బంక్ దగ్గరికి రాగానే ఆటోలోని వ్యక్తులు కత్తులు బయటకు తీసి.. ఆటో డ్రైవర్​ను బెదిరించి అతని మెడలోని గొలుసు తీసుకుని అతడిని బయటకు తోసేశారు. అనంతరం అక్కడినుంచి ఆటో తీసుకుని పరారయ్యారు. కొంత దూరం వెళ్లాక అక్కడ ఆటోను వదిలి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు బాజీ జంక్షన్​లో నిందితులను గుర్తించి.. పట్టుకోవటానికి ప్రయత్నించారు. ఆ సమయంలో తమపై ఎదురుదాడికి దిగారని.. స్థానికుల సహాయంతో నిందితులను పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితులు గంజాయి మత్తులో ఉన్నారన్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

Dr. Sudhakar case: నేరస్థులను రక్షించాలనుకుంటున్నారా.. ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

Last Updated : Nov 25, 2021, 1:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.