ETV Bharat / state

శిరోముండనం కేసులో నిందితులను విచారిస్తున్న పోలీసులు

విశాఖలో జరిగిన శిరోముండనం కేసులో అరెస్టయిన ఏడుగురిలో... ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ చేపట్టిన పోలీసులు ఈరోజూ విచారించనున్నారు.

Police investigating the accused in the head tonsure case
శిరోముండనం కేసులో నిందితులను విచారించిన పోలీసులు
author img

By

Published : Sep 11, 2020, 3:34 PM IST

విశాఖలో గత నెల 28న జరిగిన శిరోముండనం కేసులో అరెస్టయిన ఏడుగురిలో ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నూతన్‌నాయుడు భార్య ప్రియమాధురితో పాటు బ్యూటీషియన్‌ ఇందిరారాణి, సూపర్‌వైజర్‌ వరహాలును విచారించేందుకు పోలీసులకు న్యాయస్థానం రెండు రోజులు గడువు ఇచ్చింది. దీంతో ఈ ముగ్గురిని పెందుర్తి పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు. కేవలం చరవాణి కోసమే శిరోముండనం చేయాల్సి వచ్చిందా...లేక ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారించినట్లు సమాచారం. నూతన్‌నాయుడుని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతి పొందడంతో అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

ఇదీ చదవండి:

మున్నేరుకు వరద.. రైతులకు గుండె కోత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.