విశాఖ మన్యం పాడేరు ప్రధాన ఆసుపత్రిలో రక్త నిల్వలకు కొరత ఏర్పడింది. ఏజెన్సీలో మహిళలు ఎక్కువగా రక్తహీనతతో రావడం వల్ల ఇక్కడ తగినంత రక్త నిల్వలు లేవని ఆసుపత్రి సూపరింటెండెంట్ కృష్ణారావు తెలిపారు. అందుకు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాల్సిందిగా ఇటీవల ప్రకటన జారీ చేశారు. స్పందించిన జిల్లా ఎస్పీ బాపూజీ పోలీసులను ఆదేశించారు. డీఎస్పీ సహా 19మంది పోలీసులు రక్తదానం చేశారు. సకాలంలో ముందుకొచ్చి రక్తదానం చేసిన పోలీసులకు సూపరింటెండెంట్ కృష్ణారావు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి: ప్రభుత్వ సహాయం అందాలంటే... కొండ ఎక్కాల్సిందే..!