విశాఖ జిల్లా పోలమాంబ ఆలయంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 21వ తేదీన నిందితులు గుడిలోకి ప్రవేశించి.. బీరువాలోని బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. ఆలయంలోని సీసీ ఫుటేజీని సైతం అపహరణ చేశారు. సమీపంలో... కొన్ని పరికరాలను వదిలి వెళ్లారు.
డాగ్ స్క్వాడ్ ద్వారా కొన్ని కీలక ఆధారాలను సేకరించిన పోలీసులు.. పూర్ణా మార్కెట్లోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. నిందితుల్లో ఒకరు గంజాయి రవాణా కేసులో అరెస్టయినట్లు గుర్తించామని కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. నిందితులను కన్యాకుమారి ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించామన్నారు.
ఇవీ చూడండి: