విశాఖ మన్యం కొయ్యూరు మండలం తీగలమెట్ట వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలకు నర్సీపట్నంలో పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో ఇప్పటికీ నలుగురు మావోయిస్టులను బంధువులకు అప్పగించారు. మిగిలిన ఇద్దరు ఒడిశా రాష్ట్రానికి చెందిన సంతు, చత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన మడకం సాయితే. వీరి మృతదేహాలకు మంగళవారం నర్సీపట్నం కొత్తవీధి సమీపంలోనే శ్మశానంలో పోలీసులు అంత్యక్రియలు చేశారు.
ఎదురుకాల్పుల్లో..
కొన్ని రోజుల క్రితం విశాఖ జిల్లా కొయ్యూరు మండలం మంప పీఎస్ పరిధిలో తీగలమెట్ట వద్ద గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. డీసీఎం కమాండర్ సందె గంగయ్య మరణించాడు. సందె గంగయ్య స్వస్థలం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా, ఓదెల మండలం గుంపుల గ్రామం. ఘటనాస్థలిలో ఏకే-47, తుపాకులు లభ్యమయ్యాయి.
మావోయిస్టు అగ్రనాయకులు కదలికలపై పక్కా సమాచారం అందుకున్న పోలీసు అధికారులు పెద్ద ఎత్తున గ్రే హౌండ్స్, ప్రత్యేక పార్టీ పోలీసు బలగాలతో 15వ తేదీ సాయంత్రం మంప పోలీసుస్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో జల్లెడ పట్టడం ప్రారంభించారు. 16వ తేదీ తెల్లవారుజామున తీగలమెట్ట అటవీప్రాంతంలో గాలింపు బలగాలకు.. మావోయిస్టులు తారసపడ్డారు. ఇరువైపులా కాల్పులు పెద్ద ఎత్తున జరిగాయి. కొంత సమయం తర్వాత.. మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు నిలిచిపోవడంతో పోలీసులు ఘటనా స్థలాన్ని గాలించగా ఆరుగురు మావోయిస్టు మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఇదీ చదవండి: