మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఏవోబీలోని ముంచంగిపుట్టును పోలీసులు జల్లెడ పట్టారు. ముంచంగిపుట్టు ఎస్సై ప్రసాద్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక శిక్షణ పొందిన జాగిలాలతో కార్లు, జీపులు, ఆటోలను సైతం తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా ఒడిశా సరిహద్దు గ్రామాల నుంచి వస్తున్న వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లకు ప్రతీకారం తీర్చుకోవటానికి మావోయిస్టులు దాడులు జరపవచ్చని పోలీసులంతా అప్రమత్తమయ్యారు.
ఇదీ చదవండి.. మన్యంలో అలజడి.. నేటినుంటి మావోయిస్ట్ వారోత్సవాలు