విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని సబ్బవరంలో తప్పించుకున్న ఇద్దరు గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మండలంలో నిన్న ఉదయం… మామిడి పళ్ల వ్యాన్‌లో గంజాయి తరలిస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వారిద్దరూ పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకుని పరారయ్యారు.
వెంటనే అప్రమత్తమైన స్థానిక ఎస్సై చంద్రశేఖర్ రావు మరో ఎస్సై సతీష్, స్థానిక రైతుల సహకారంతో తవ్వవానిపాలెం పొలాల్లో… నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.60 లక్షలు విలువచేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరు… బిహార్‌కు చెందిన నందకిషోర్, జాన్ కుమార్‌గా గుర్తించామని చెప్పారు.
ఇదీ చదవండి: