విశాఖ జిల్లా పెద్దవాల్తేరులో కొలువైన శ్రీకరకచెట్టు పోలమాంబ తొలేళ్లు ఉత్సవం ఘనంగా జరుగుతోంది. చైత్ర పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం ఈ వేడుకను నిర్వహిస్తారు. కొవిడ్ నిబంధనల మేరకు దేవాలయంలో రసాయనాలు పిచికారీ చేశారు. భక్తులు భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టి.. అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. పెద్దవాల్తేరు సమీపంలోని పలు గ్రామాల ప్రజలు సైతం అమ్మవారి దర్శనానికి వస్తున్నారు.
ఇదీ చదవండి: 'ఈటీవీ బాలభారత్' ఛానళ్లను ప్రారంభించిన రామోజీరావు