చెరకు సాగు చేసే రైతులకు చెరకు అభివృద్ధి మండలి (సీడీసీ) ద్వారా 30 శాతం రాయతీపై క్రిమి సంహారక మందుల సరఫరా చేస్తున్నారు. మందులతో పాటు సాగునీటిని పొలాలకు పారించేందుకు వినియోగించే మడత పైపులను రాయితీపై అందిస్తున్నట్లు మండలి కార్యాలయ వర్గాలు తెలిపాయి. విశాఖ జిల్లా చోడవరం గోవాడ చక్కెర కర్మాగారానికి అనుబంధంగా నడిచే ఈ మండలి ఏటా రూ.40లక్షలతో వార్షిక బడ్జెట్ను రూపొందిస్తోంది. ఈ నిధులతో చెరకు సాగుకు అవసరమయ్యే సస్యరక్షణ మందులు, పరికరాలను చక్కెర కర్మాగారం సభ్యులైన, చెరకు రైతులకు అందిస్తారు.
ఇవీ చూడండి...