విశాఖ జిల్లా యలమంచిలి మున్సిపల్ ఛైర్పర్సన్గా పిల్లా రమాకుమారి, వైస్ ఛైర్మన్గా బెజవాడ నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 25 కౌన్సిలర్ స్థానాలకుగాను వైకాపా 23 చోట్ల గెలుపొందింది. ఒక వార్డును తెదేపా, మరో స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి దక్కించుకున్నారు. ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణమూర్తి రాజు (కన్నబాబు రాజు) సమక్షంలో.. స్థానిక గోపిశెట్టి కళ్యాణ మండపంలో ఆర్డీఓ సీతారామారావు ఛైర్పర్సన్ ఎన్నిక నిర్వహించారు. విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి తులసీరావు కుమార్తె పిల్లా రమాకుమారి చేత పదవీ ప్రమాణం చేయించారు.
కౌన్సిలర్లను ఉద్దేశించి ఎమ్మెల్యే కన్నబాబు రాజు కొద్దిసేపు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, అనకాపల్లి పార్లమెంట్ వైకాపా నేత ఆడారి ఆనంద్ కుమార్తో పాటు పార్టీ స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: విశాఖలో వైకాపా కార్పొరేటర్ వంశీ అనుచరుల నిరసన