విశాఖ జిల్లా గాజువాక పారిశ్రామికవాడ ప్రజలు.. పందుల భయంతో బెంబేలెత్తుతున్నారు. వరాహాల స్వైర విహారంతో కాలు బయట పెట్టడానికి వణికిపోతున్నారు. గుంపులు గుంపులుగా తిరుగుతున్న పందులు.. బయటకు వెళితే ఎక్కడ దాడి చేస్తాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బర్మా కాలనీలో ఓ వృద్ధురాలిపై అవి దాడి చేశాయి. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరో ఘటనలో మూడేళ్ల చిన్నారిని లాక్కెళ్లటానికి ప్రయత్నించగా..సమీపంలో ఉన్నవారు గుర్తించి వాటిని తరిమేశారు.
బర్మా ప్రాంతంలోని పందుల పెంపకందారులు వరాహాలను ఇష్టానురీతిగా బయటకు వదులుతున్నారు. ఫలితంగా అవి రోడ్లపై స్వైర విహారం చేస్తున్నాయి. జగ్గూ జంక్షన్, బర్మా కాలనీ, గంగవరం పోర్టు సమీపంలో గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. ఫలింతగా ఈ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర జ్వరాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. సమస్యపై మున్సిపల్ అధికారులకు సమాచారం అందించినా... నామమాత్రంగా చర్యలు తీసుకున్నారే తప్ప పరిష్కారం లభించలేదని ప్రజలు వాపోతున్నారు.
ఇళ్లల్లోకి చొరబడి ఆహార పదార్థాలను నాశనం చేస్తున్నాయని... చిన్న పిల్లలపై దాడులకు తెగబడుతున్నాయని ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరపాలక సంస్థ అధికారులు సరైన చర్యలు తీసుకొని పందుల విహారాన్ని అడ్డుకోవాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: