పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందించే జగనన్న అమ్మ ఒడి పథకానికి సాంకేతిక సమస్యల కారణంగా విశాఖ జిల్లాలో వేల మంది విద్యార్థులు దూరమైపోతున్నారు. గతేడాది జిల్లాలో సుమారు 30 వేల మంది పథకాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఈ ఏడాది కూడా కరోనా కారణంగా పాఠశాలలు పూర్తిస్థాయిలో తెరుచుకోకపోవటం, రేషన్ కార్డుల స్థానంలో బియ్యం కార్డులు రావటం, ఫీజులు చెల్లిస్తే గాని ప్రైవేటు పాఠశాలలు పిల్లల వివరాలను అమ్మఒడి పోర్టల్లో నమోదు చేయమని చెబుతుండటం తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది.
దీంతో ఈటీవీ భారత్ 'ఈనాడు-మీ తోడు' కార్యక్రమం ద్వారా డీఈవోతో ఫోన్ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు డీఈవోతో నేరుగా మాట్లాడి సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం కల్పించింది. అమ్మఒడి పథకం నమోదులో ఎదురవుతున్న ఇబ్బందులను తల్లిదండ్రులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. తల్లిదండ్రుల ప్రశ్నలకు డీఈవో లింగేశ్వర రెడ్డి సమాధానం చెప్పారు.
ఇదీచదవండి