ETV Bharat / state

విశాఖలో ప్రేమోన్మాదం.. కత్తితో గొంతు కోసి..! - యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు న్యూస్

విశాఖలో మరోసారి ప్రేమోన్మాదం కట్టలు తెంచుకుంది. గత నెల గాజువాకలో జరిగిన ఘాతుకాన్ని జీర్ణించుకునేలోపే.. మరో వ్యక్తి ప్రేమ పేరిట యువతిపై కత్తి కట్టాడు. ప్రేమించనని చెప్పినందుకు... యువతి ఇంట్లోకి దూరి ఆమె గొంతు కోసి... తననూ గాయపర్చుకున్నాడు. ఇద్దరికీ ప్రస్తుతం కేజీహెచ్​లో చికిత్స అందిస్తున్నారు.

విశాఖలో ప్రేమోన్మాదం.. కత్తితో కంఠం కోసి..!

author img

By

Published : Dec 2, 2020, 9:00 PM IST

Updated : Dec 2, 2020, 9:09 PM IST

ప్రశాంత విశాఖలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. గాజువాకలో యువతి హత్యోందంతం మరువక ముందే.. మరో యువకుడు ప్రేమ పేరిట అమ్మాయి గొంతు కోశాడు. థామ్సన్ వీధిలో ఉండే ప్రియాంక.. డిగ్రీ ఫైనలియర్ చదువుతూ వాలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. స్థానికంగా ఉండే శ్రీకాంత్.. ప్రేమ పేరుతో ఆమె వెంట పడేవాడు. తిరిగి ప్రేమించాలని చాలాసార్లు ఆమెను ఇబ్బందిపెట్టేవాడు. తల్లిదండ్రుల చెప్పినట్లు నడుచుకుంటానని.. పదే పదే ఆమె చెబుతూ వచ్చింది. దీన్ని మనసులో పెట్టుకున్న శ్రీకాంత్.. ఉదయం యువతి ఇంట్లోకి చొరబడి ఆమె గొంతు కోసి.. తననూ గాయపర్చుకున్నాడు. గమనించిన స్థానికులు.. వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

విశాఖలో ప్రేమోన్మాదం.. కత్తితో కంఠం కోసి..!

కోలుకున్నాక కస్టడీలోకి..

ఘటనా స్థలిని దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్‌ పరిశీలించారు. ఈ దాడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్టు వెల్లడించారు. విశాఖ శాంతిభద్రతల డీసీపీ ఐశ్వర్య రస్తోగి కేజీహెచ్​లో ప్రియాంక, శ్రీకాంత్‌కు అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితురాలు స్పృహలోకి వచ్చిన వెంటనే ఆమె వాంగ్మూలం తీసుకుంటామని రస్తోగి తెలిపారు. నిందితుడు కోలుకున్నాక కస్టడీలోకి తీసుకుంటామన్నారు.

మాట వస్తుందా? లేదా? చెప్పలేం

ప్రియాంక, శ్రీకాంత్ ఇద్దరికీ శ్వాస నాళం దెబ్బతిన్నట్లు ఏఎంసీ ప్రిన్సిపల్ పీవీ సుధాకర్ వెల్లడించారు. ప్రత్యామ్నాయ ఏర్పాటుతో వారు శ్వాస తీసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. ప్రియాంకకు స్వర పేటిక తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిపారు. ఆమెకు మాట వస్తుందా? లేదా? అనే విషయం ఇప్పుడే చెప్పలేమన్నారు. ఇద్దరు కోలుకోవడానికి కొద్ది రోజుల సమయం పడుతుందని ప్రాణాపాయం తప్పిందని సుధాకర్ చెప్పారు.

ఇదీ చదవండి: 'నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 నుంచి 30 వేలు ఇవ్వండి'

Last Updated : Dec 2, 2020, 9:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.