విశాఖలో కొవిడ్ పరీక్షల కోసం ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్ల వద్ద బాధితులు బారులు తీరుతున్నారు. గంటల కొద్దీ లైన్లలో నిలబడుతున్నారు. విశాఖలో మొత్తం 72 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, మాక్ సెంటర్లలో కొవిడ్ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. ఆరిలోవ లోని ఓ ప్రైవేటు ల్యాబ్ వద్ద జనాలు సుమారు ఒక కిలోమీటర్ దూరం వరకు వరుసలో నిల్చున్నారు. ఎలాంటి అనుమానం ఉన్నా... ప్రజలు కొవిడ్ పరీక్షలు చేయించుకోవడంతో... రద్దీ ఎక్కువగా ఉంటోంది.
ఇదీ చదవండి: విశాఖ నగరంలో రెండో డోస్ వ్యాక్సిన్