ETV Bharat / state

వంజంగి కొండల అందం ... ప్రకృతి రమణీయం

author img

By

Published : Dec 26, 2020, 12:34 PM IST

ప్రకృతి రమణీయ దృశ్యాలకు విశాఖ పాడేరు పెట్టింది పేరు. అక్కడ సహజసిద్ధమైన అందాలకు వంజంగి కొండలు కేరాఫ్​ అడ్రస్​గా నిలుస్తున్నాయి. ఈ ఆహ్లదకరమైన వాతావరణాన్ని తిలకించేందుకు పర్యటకులు భారీగా తరలి వస్తున్నారు. ఈ అందాలను ఆస్వాదిస్తూ మైమరిచి పోతున్నారు.

scenario
వంజంగి కొండల అందం ... ప్రకృతి రమణీయం
వంజంగి కొండల అందాలు

విశాఖ జిల్లా పాడేరుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంజంగి కొండలు పర్యాటకులను కట్టి పడేస్తున్నాయి. సహజ సిద్ధమైన అందాలను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ద్వి చక్ర వాహనాలతో పాటు కార్లలో ఈ ప్రదేశానికి చేరుకుంటున్నారు. కొంతమంది యువత రాత్రి పూట టెంట్లు వేసుకొని అక్కడే ఉండిపోతున్నారు.

వంజంగి కొండలు సముద్రమట్టానికి 4500 అడుగుల ఎత్తులో ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. పూర్వం రోజుల్లో బ్రిటిష్ హయాంలో వాళ్లు పేర్చిన రాళ్లు ఇక్కడ దర్శనమిస్తాయని చెప్పారు. పర్యటకులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఈ ప్రదేశం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని స్థానికులు తెలిపారు.

ఇదీ చదవండి:

సాహస యాత్రలే నందిత వ్యాపకం... పర్వతారోహణలో ఆదర్శం...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.