విశాఖ సింహాచలం అడివివరం గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ టీక వేయకపోవటం పట్ల ప్రజలు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆసుపత్రి సిబ్బంది తలుపులు మూసివేశారు. జిల్లా నుంచి తమకు రావాల్సిన టీకాల నిలవలు రాలేదని.. అందుకే వ్యాక్సిన్ వేయడం లేదని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. అయినప్పటికీ ఆసుపత్రికి వచ్చిన వారు.. తమకు టీకాలు వేయాలని నినాదాలు చేశారు.
ఇవీ చూడండి...: కొవిడ్ ఎఫెక్ట్: రాత్రి వేళ బయటికొస్తే కేసులే!