'అర్హులందరికీ వచ్చే నెల నుంచి పింఛన్ ఇస్తాం' - pension issue in visakha
అర్హులైన వారందరికీ పింఛన్లు పంపిణీ చేస్తామని... నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ తెలిపారు. విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలక సంఘం పరిధిలోని పింఛన్లకు సంబంధించి ఆయన సమీక్ష నిర్వహించారు. అర్హులందరికీ రెండు నెలల పింఛన్లు వచ్చే నెలలో అందజేస్తామని ఎమ్మెల్యే చెప్పారు.