విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలం జాలంపల్లి లోని పెద్దేరు జలాశయం.. రైతుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. రబీ సాగుకు సరిపడా ఉన్న నీటితో నిండుకుండలా కళకళలాడుతోంది. జలాశయం నుంచి ఆయకట్టు ప్రాంతానికి సాగునీటి విడుదల కొనసాగుతోంది. ఆయకట్టు ప్రాంతంలోని ఒమ్మలి, సత్యవరం, గాదిరాయి, జె.డి.పేట, కింతలి, పొంగలిపాక, జంపెన, వీరనారాయణం, కింతలి వల్లాపురంతో పాటు మరిన్ని గ్రామాల్లో... రబీ సీజనులో 4,500 ఎకరాల్లో సాగు కానున్న పంటకు.. ఈ నీరు వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 137 మీటర్లు కాగా, ప్రస్తుతం 134 నీటి మట్టం ఉంది. రబీ పంట మరికొద్ది రోజుల్లో చేతికొస్తుంది ఈ ప్రాంత రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నిండుకుండలా పెద్దేరు జలాశయం.. రైతుల్లో ఆనందం
విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలం జాలంపల్లి పెద్దేరు జలాశయం నిండుకుండను తలపిస్తోంది. గత ఏడాది కురిసిన వర్షాలు ప్రస్తుతం రబీ సాగుకు కలిసొచ్చాయి. ఆయకట్టు ప్రాంతంలోని చెరువుల్లో నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి.