ETV Bharat / state

vishaka encounter: మన్యంలో ఎదురుకాల్పులు...తెలంగాణలో విషాదం

author img

By

Published : Jun 16, 2021, 9:10 PM IST

విశాఖ జిల్లా మంప పీఎస్ పరిధిలో జరిగిన ఎదురుకాల్పులు.. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో అలజడి సృష్టించింది. ఘటనలో తెలంగాణ వాసి చనిపోయినట్లు వార్తలు రావడంతో మృతుడి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతని కుటుంబీకులు శోక సంద్రంలో మునిగిపోయారు.

mavoist dead: మంప ఎదురుకాల్పుల్ల మావోయిస్టు మృతి

mavoist dead: మంప ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి

విశాఖ జిల్లా కొయ్యూరు మండలం మంప పీఎస్​ పరిధిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో తెలంగాణలోని పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన మావోయిస్టు నేత సంద గంగయ్య అలియాస్ అశోక్ మృతి చెందినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న మావోయిస్టు గంగయ్య తల్లి అమృతమ్మ బోరున విలపించింది. తన కుమారుడు గంగయ్య ఎన్​కౌంటర్​లో మృతి చెందడం బాధాకరం అంటూ తన చిన్న కుమారుడు మహేందర్​ను పట్టుకొని కన్నీరుమున్నీరైంది.

1999లో అజ్ఞాతంలోకి వెళ్లిన గంగయ్య.. స్థానికంగా ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. తండ్రి రామస్వామి, తల్లి అమృతమ్మ దంపతులకు మొత్తం నలుగురు కుమారులు. పెద్ద కుమారుడు రాజయ్య మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొని 1996లో ఎన్​కౌంటర్​లో మృతి చెందాడు. ప్రస్తుతం మంప ఎదురుకాల్పుల్లో మృతి చెందిన గంగయ్య వారికి రెండో కుమారుడు.

ఇదీ చదవండి:

Vishaka Encounter: విశాఖ మన్యంలో ఎన్​కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు హతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.