విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన బాధిత ప్రాంతాలను పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ సందర్శించారు. ఏఐసీసీ సభ్యులు రమణికుమారితో కలిసి బాధితులను పరామర్శించారు. అక్కడి పరిస్థితులను గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమ చుట్టుపక్కల గాలి, నీరు కలుషితమయ్యాయని.. జీవ వైవిద్యానికి ముప్పు వాటిల్లిందన్నారు.
ఇక్కడి ప్రజలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని కోరారు. మంత్రులు అన్ని హంగులు సమకూర్చుకుని అక్కడ నిద్రపోయినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావన్నారు. కంపెనీని జనావాసాల మధ్య నుంచి తరలించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి.. 'పరిహారంలో అవకతవకలున్నాయి'.. మంత్రిని అడ్డుకున్న బాధితులు