ETV Bharat / state

అరకు ఆదివాసీల పాటను ఆస్వాదించిన పవన్ - pawan met tribals news

వకీల్‌సాబ్‌ షూటింగ్‌ విరామంలో అరకు ఆదివాసీలు పాడిన పాటను ఆస్వాదించారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ పాట వింటుంటే బిభూతిభూషణ్‌ బందోపాధ్యాయ రచించిన వనవాసి గుర్తుకు వస్తోందని ఆయన అన్నారు.

pawan-kalyan-spent-the-shooting-break-with-the-tribals
అరకులో పవన్ కల్యాణ్
author img

By

Published : Dec 24, 2020, 11:47 AM IST

Updated : Dec 24, 2020, 1:14 PM IST

సినీ హీరో, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గిరిజనులతో ఉల్లాసంగా గడిపారు. వకీల్‌సాబ్‌ సినిమా షూటింగ్‌ విరామంలో అరకు ఆదివాసీలతో ఆయన ముచ్చటించారు. అడవి తల్లితో ముడిపడిన తమ జీవన స్థితిగతులను వివరిస్తూ ఆంధ్ర - ఒరియాలో గిరిజనులు పాడిన పాటను పవన్ ఆస్వాదించారు. ఈ పాట వింటుంటే బిభూతిభూషణ్‌ బందోపాధ్యాయ రచించిన వనవాసి తనకు గుర్తుకు వస్తోందని పవన్‌ ట్వీట్‌ చేశారు.

అలాగే జనసేన పోరాట యాత్రలో భాగంగా అరకు పర్యటనలో ఆదివాసీల జీవన పరిస్థితులు తనకు బాధ కలిగించాయని పవన్ పేర్కొన్నారు. ఆదివాసీల సంస్కృతి పరిరక్షించాలని, వారి జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురావటానికి జనసేన - జన సైనికులు నిరంతరం అండగా ఉంటామని తెలిపారు.

అరకు ఆదివాసీల పాటను ఆస్వాదించిన పవన్

ఇదీ చదవండి:

వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద సీఎం జగన్‌ నివాళులు

Last Updated : Dec 24, 2020, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.