ETV Bharat / state

విశాఖలో ప్రశాంతంగా కొనసాగుతున్న పరిషత్​ ఎన్నికలు - విశాఖ జిల్లాలో పరిషత్​ ఎన్నికలు

విశాఖ జిల్లాలో పరిషత్​ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయాన్నే ఓటర్లు పోలింగ్​ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

parishath elections
విశాఖలో పరిషత్​ ఎన్నికలు
author img

By

Published : Apr 8, 2021, 12:06 PM IST

విశాఖ జిల్లాలో పరిషత్​ ఎన్నికల ఓటింగ్​ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్​ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ జిల్లాలో మెుత్తం 37 జడ్పీటీసీ, 614 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. జడ్పీటీసీకి 314 మంది, ఎంపీటీసీలకు 3715 మంది బరిలో ఉన్నారు. 2100 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నిక నిర్వహిస్తున్నారు. వీటిల్లో 732 సమస్యాత్మకం, 801 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి భద్రత కల్పించారు. సాధారణ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు ఎన్నిక జరగనుండగా.. ఏజెన్సీ ప్రాంతంలో మధ్యాహ్నం రెండు గంటలకే ముగియనుంది.

  • పాడేరులో జరుగుతున్న ప్రాదేశిక ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటుహక్కు ఎక్కడ ఉందో తెలియక తర్జన భర్జన పడుతున్నారు. సమయం లేకపోవడంతో ముందస్తుగా ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేయలేదు. ఈ కారణంగా వారి నెంబర్ ఎంత ఉందో? ఎక్కడుందో? తెలియక ఇబ్బందులు పడుతున్నారు. పోలింగ్ కేంద్రాలు బోసిపోయాయి.. ఓటర్లు ఓటర్ లిస్ట్​ను పట్టుకుని వెతుకుతున్నారు. పాడేరు ఏజెన్సీలో 169 ఎంపీటీసీ 11 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి మారుమూల ప్రాంతాల్లో పోలీస్ పహారాలో వాహనాలతో ఓటర్ల తరలిస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే అధికారులు పోలింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ విధులకు వచ్చిన వైద్య సిబ్బందికి కనీసం బెంచీలు కూడా వేయకపోవటంతో కేంద్రంలో నేలపైన మందులు పరిచారు.
  • నర్సీపట్నంలో పరిషత్​ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నర్సీపట్నంతో పాటు రోలుగుంట, రావికమతం, మాకవరపాలెం, నాతవరం.. మండలాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరుతున్నారు. వృద్ధులు, రోగులు నడవలేని ఓటర్లను వాహనాల్లో తీసుకువచ్చి ఓట్లను వేస్తున్నారు. రోలుగుంట మండలం సంబంధించి ఇప్పటికే జడ్పీటీసీ ఎన్నిక ఏకగ్రీవం కాగా మండల ప్రాదేశిక సభ్యుల ఎన్నికలు కొనసాగుతున్నాయి.
  • మాడుగుల నియోజకవర్గంలోని మాడుగుల, చీడికాడ, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లో పోలింగ్​ ప్రశాంతంగా జరుగుతోంది. కె.కోటపాడు మండలం దాలివలస ఎంపీటీసీ స్థానానికి తెదేపా తరుపున పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే మంగపతిరావు మృతి చెందడంతో ఇక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి.
  • చోడవరం నియోజకవర్గంలో పరిషత్​ ఎన్నికల ఓటింగ్​ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయాన్నే ఓటర్లు తమ ఓటు వేసేందుకు ఆసక్తి చూపారు. ఇక్కడ 25 ఎంపీటీసీ స్థానాలకుగాను.. 3 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 22 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.

ఇదీ చదవండీ.. లైవ్ ఆప్​డేట్స్: కొనసాగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.