భారతదేశంలో స్మార్ట్ స్పీకర్ల వినియోగం గణనీయంగా పెరుగుతోందని అమెజాన్ ఉత్పత్తుల భారత అధిపతి పరాగ్‌గుప్తా పేర్కొన్నారు. బుధవారం జూమ్ సమావేశంలో ఆయన దేశంలోని వివిధ నగరాల్లోని విలేకరులతో మాట్లాడారు. ‘అండర్‌స్టాండింగ్ స్మార్ట్ స్పీకర్ యూసేజ్ ఇన్ నాన్ మెట్రో సిటీస్’ పేరిట తాము వెయ్యి మందితో మాట్లాడి ఒక అధ్యయనం చేశామని తెలిపారు. నాన్‌మెట్రో నగరాల్లో 54శాతం మందికి స్మార్ట్ స్పీకర్లపై అవగాహన వచ్చిందన్నారు.
పలువురు తమ నోటి ఆజ్ఞలతోనే ఇంటిలోని పలు ఉపకరణాల్ని కావాల్సిన విధంగా పనిచేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారన్నారు. నాన్‌మెట్రో నగరాల్లోని సుమారు 50శాతం మంది వినియోగదారులు తమ సాధారణ ఇళ్లను ‘స్మార్ట్ హోం’గా మార్చుకోవడానికి అవసరమైన స్మార్ట్ స్పీకర్లను, దానికి అనుసంధానమై ఉండే ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. వినియోగదారుల్లో 43శాతం స్మార్ట్‌స్పీకర్లతో హిందీలో సంభాషిస్తున్నారని పేర్కొన్నారు.
లక్నో, కాన్పూర్, పట్నా, జైపూర్, అహ్మదాబాద్, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం తదితర నగరాల్లోని వినియోగదారులు ప్రతిరోజూ 2.5ం గంటలు స్మార్ట్‌స్పీకర్‌ను వినియోగిస్తున్నట్లు తేలిందన్నారు. 81శాతం వినియోగదారులు స్మార్ట్‌స్పీకర్‌ను వారి లివింగ్‌రూంలోనే ఉంచుతున్నారన్నారు. గతంతో పోలిస్తే 55శాతం మంది సంగీతాన్ని ప్రశాంతంగా వినగలుగుతున్నట్లు చెప్పారని, 50 శాతం మంది వినియోగదారులు వివిధ రకాల బిల్లులను స్మార్ట్‌స్పీకర్‌తో సునాయసంగా చెల్లిస్తున్నట్లు తెలిపారని పరాగ్ గుప్తా పేర్కొన్నారు. ‘అలెక్సా’ను భారత వినియోగదారులకు మరింత దగ్గర చేయడానికి అమెజాన్ కృషిచేస్తోందన్నారు.
ఇంగ్లీష్ నేర్చుకోవడంలోనూ అలెక్సా సాయపడుతోందన్నారు. స్మార్ట్‌స్పీకర్ల గురించి తెలిసినవారిలో 97శాతం మందికి అమెజాన్ ఎకో(అలెక్సాతో) గురించి కూడా తెలిసినట్లు అధ్యయనంలో వెల్లడైందన్నారు. తమ పిల్లల భాష, ఉచ్ఛారణ నైపుణ్యాలను మెరుగుపరచడంలో స్మార్ట్‌స్పీకర్లు అత్యంత ఉపయుక్తంగా ఉన్నాయని 47శాతం మంది, తమ పిల్లలు మరిన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నారని 52శాతం మంది చెప్పారన్నారు.
ఇదీచదవండి