విశాఖ మన్యంలో విశిష్టత కలిగిన మత్స్య లింగేశ్వర స్వామి దేవాలయం శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. హుకుంపేట మండలం మఠం పంచాయతీ మత్స్యగుండంలో వెలసిన మత్స్య లింగేశ్వర స్వామి దేవాలయంలో చేపలు, పాములకు పూజలు చేస్తారు. ప్రతి శివరాత్రి రోజున ఈ ఉత్సవాలు ప్రారంభమై మూడు రోజులపాటు జాతర జరుగుతుంది. జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీతో పాటు ప్రభుత్వం కూడా అన్ని చర్యలు చేపట్టింది. పాడేరు సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్ ఉత్సవ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
ఇవీ చూడండి...