ఆసుపత్రిలో ప్రసవాలు పెంచాలని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వర్ వైద్యులను ఆదేశించారు. బుధవారం కొయ్యూరు మండలంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. డౌనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ప్రసవాలు తక్కువగా జరుగుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్డీఎఫ్ నిధుల వినియోగంపై ఆరా తీశారు. కంఠారం ఆరోగ్య కేంద్రంలో మలేరియా జ్వరాల వ్యాప్తి, నిధుల చెల్లింపులు అడిగి తెలుసుకున్నారు.
డౌనూరు, చిట్టెంపాడు, కొమ్మిక పాఠశాలల్లో లక్షల రూపాయలతో జరుగుతున్న నాడు- నేడు పనులు పరిశీలించారు. సచివాలయ భవనాన్ని ఆగస్టు చివరినాటికి పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. చిట్టెంపాడులో రేషన్ డిపోని సందర్శించి ఉచిత బియ్యం పంపిణీ తీరు గురించి లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. నల్లగొండలో ఆర్ఓఎఫ్ఆర్ భూముల సర్వే జరుగుతున్న తీరు రైతులను అడిగి తెలుసుకున్నారు. మన్యంలో 13,200 ఎకరాల భూములకు హక్కు పత్రాల పంపిణీకి చర్యలు తీసుకొంటున్నట్టు వెంకటేశ్వర్ తెలిపారు.
ఇదీ చదవండి :
పాడేరులో భారీ వర్షం.. పొంగిపొర్లిన వాగులు