ETV Bharat / state

మిలీషియాగా పని చేస్తున్న గిరిజనులు లొంగిపోవాలి: డీఎస్పీ

author img

By

Published : Aug 11, 2020, 11:23 PM IST

విశాఖ మన్యంలో మావోయిస్టు పేరిట వచ్చిన ఆడియో టేపులపై విశాఖ జిల్లా పాడేరు డీఎస్పీ రాజ్​కమల్​ స్పందించారు. మావోయిస్టులతో చేతులు కలిపి మిలీషియాగా పనిచేస్తున్న వారు లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. గిరిజనులు ఎవరూ వీరిని నమ్మే పరిస్థితి లేదని అన్నారు.

మావోయిస్టులకు మిలీషియాగా పనిచేస్తోన్న వారు లొంగిపోండి: డీఎస్పీ

మావోయిస్టు పార్టీ కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి సురేంద్ర అనే పేరు మీద వచ్చిన ఆడియోపై విశాఖ జిల్లా పాడేరు డీఎస్పీ రాజ్​ కమల్​ స్పందించారు. మావోయిస్టులు గిరిజనులతో చట్ట వ్యతిరేక పనులు చేయిస్తున్నారని జాగ్రత్తగా ఉండాలంటూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలిసో తెలియకో మావోయిస్టులతో చేతులు కలిపి.. వారికి మిలీషియాగా పని చేస్తున్న గిరిజనులు లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు.

మావోయిస్టు నేతల మాటలు విని మీరు గిరిజన ప్రాంతంలో గ్రామాల చుట్టూ పోలీసులను చంపాలనే ఉద్దేశంతో మందుపాతరలు పెడితే అక్కడ నివసించే అమాయక గిరిజనులు వాటికి బలైపోతున్నారు. గిరిజనుల ప్రాణాలంటే మావోయిస్టులకు లెక్కలేదు. మావోయిస్టులు మన్యం ప్రాంతాలకు వచ్చినప్పుడు మీరు వారికి సహకరిస్తూ.. తప్పించుకునేందుకు సహాయపడుతున్నారు. చివరకు వారి మాటలు విని మీరు తోటి గిరిజనులనే హతమారుస్తున్నారు. మావోయిస్టులతో చేతులు కలిపినప్పటి నుంచి మీరు ఎంతటి దుర్భరంగా జీవనం సాగిస్తున్నారో నాకు తెలుసు. ఇప్పటికే గ్రామస్థుల్లో మీపై వ్యతిరేకత వచ్చింది. మావోయిస్టు పార్టీ అగ్రనేతల చేతుల్లో మీరు కేవలం కీలుబొమ్మలని గిరిజనులు తెలుసుకున్నారు. మీరు మాత్రం తెలుసుకోలేకపోతున్నారు.

ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని.. ఎలాంటి భయం లేకుండా.. స్వచ్ఛందంగా వచ్చి మా ముందు లొంగిపోండి. మీరు ఎవరి ద్వారా లొంగిపోవాలి అని మదన పడాల్సిన అవసరం కూడా లేదు. పాడేరు వచ్చి అంబేడ్కర్​ జంక్షన్ నుంచి పోలీస్ స్టేషన్ రోడ్డు వైపు వస్తుంటే నా కార్యాలయం ఉంటుంది. అక్కడికి వచ్చి నన్ను కలిస్తే మీకు ఎలాంటి హానీ కలగకుండా కాపాడే బాధ్యత నాది. - రాజ్​కమల్​, డీఎస్పీ

ఇదీ చూడండి..

మన్యంలో మృతుల కుటుంబాలకు మావోల క్షమాపణ.. ఆడియో విడుదల

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.