ETV Bharat / state

Against MLA Baburao: ఎమ్మెల్యే బాబూరావుపై సొంత పార్టీ కార్యకర్తల తిరుగుబావుటా!

YSRCP activists against MLA Baburao: విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుపై.. సొంత పార్టీ కార్యకర్తలే తిరగబడ్డారు. పార్టీ కోసం రేయింబవళ్లు కష్టపడుతున్న తమకు గౌరవం ఇవ్వడం లేదంటూ ఆందోళన చేశారు.

own-party-leaders-revolt-against-ycp-mla-baburao
ఎమ్మెల్యే బాబూరావుపై సొంత పార్టీ కార్యకర్తల తిరుగుబావుటా!
author img

By

Published : Dec 29, 2021, 10:30 AM IST

ఎమ్మెల్యే బాబూరావుపై సొంత పార్టీ కార్యకర్తల తిరుగుబావుటా!

విశాఖ జిల్లా పాయకరావుపేట వైకాపా ఎమ్మెల్యే గొల్ల బాబూరావుపై.. సొంత పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులు తిరుగుబావుటా ఎగురవేశారు. ఎస్‌. రాయవరం మండలం బంగారంపాలెంలో సమావేశమైన నేతలు.. ఎమ్మెల్యే తీరుపై తీవ్ర ఆగ్రహం, ఆక్రోశం వెలిబుచ్చారు. పదేళ్లుగా జెండా మోసిన కార్యకర్తలకు విలువ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల వద్ద కొంచెం కూడా గౌరవం లభించడం లేదని వాపోయారు.

వాలంటీర్లు తమ మాట వినడం లేదని ఎస్‌ రాయవరం మండలం ఎంపీపీ శారదాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు హాజరయ్యారు. ఎమ్మెల్యే డబ్బు, కులాలకు ప్రాధాన్యం ఇస్తూ సొంత పార్టీ నాయకులను పక్కన పెడుతున్నారని ఆరోపించారు. తాము పార్టీలో ఉంటూ పార్టీ కోసం కష్టపడుతున్నామని.. ఎమ్మెల్యే మాత్రం తమను పట్టించుకోవడం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇందుకు తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.

ఇదీ చూడండి:

TIRUMALA HUNDI INCOME: శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.3.26 కోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.