విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలం వెంకటనగరం సముద్ర తీరం వద్ద వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి జరిగింది. పెద రామభద్రపురం గ్రామానికి చెందిన కొందరు యువకులు... వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు తీరానికి వెళ్లారు. కార్యక్రమం పూర్తయిన అనంతరం హరి, రామరాజు, లచ్చబాబు తదితరులు సముద్రంలో స్నానం చేస్తుండగా... అలల తాకిడికి లోనికి కొట్టుకుపోయారు. ప్రమాదాన్ని గమనించిన ఓ యువకుడు ఇద్దరిని రక్షించగా... లచ్చబాబు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న మత్స్యకారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒడ్డుకు చేరిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ అస్తమయం