ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఓ వ్యక్తి మృతి చెందిగా.. మరొక వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన విశాఖ జిల్లా పాడేరు మండలం ఘాట్ రోడ్డు వద్ద జరిగింది. మృతుడు వంటల మామిడిలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న భీమునాయుడిగా గుర్తించారు. మృతుడు దుకాణం మూసివేసి ఇంటికి వెళ్తుండగా, ఘాట్ రోడ్డు వద్దకు వచ్చేసరికి బ్రేకులు విఫలమవ్వటంతో ద్విచక్ర వాహనం అదుపు తప్పి 20 అడుగుల లోయలోకి దూసుకుపోయింది. తలకు బలమైన గాయమవ్వటంతో భీమునాయుడు అక్కడికక్కడే మరణించాడు. మృతుడితో పాటు ప్రయాణిస్తున్న నరేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. భీమునాయుడు మృతి సమాచారం తెలియటంతో అతడి స్వస్థలమైన కోడూరులో విషాధఛాయలు అలముకున్నాయి.
ఇదీ చదవండి: కనీస రక్షణ పరికరాలు లేవు: పారిశుద్ధ్య కార్మికులు