ETV Bharat / state

'మీరు చనిపోయారు..' 'లేదు నేను బతికే ఉన్నాను బాబోయ్' - కరోనా బాధితురాలిపై తప్పుడు నివేదిక వార్తలు

కరోనా రోగుల సమాచారం విషయంలో అధికారుల వైఖరి విమర్శలకు తావిస్తోంది. రోగుల వివరాల నమోదులో పొరపాటుతో మృతదేహాలు కొన్ని సందర్భాల్లో చేతులు మారిపోతుండగా, మరి కొంతమంది..బతికున్నా.. చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తుండటం పట్ల బాధితుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

'మీరు చనిపోయారు..' 'లేదు నేను బతికే ఉన్నాను బాబోయ్'

author img

By

Published : Aug 5, 2020, 10:08 PM IST

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం ముఖలింగాపురం పంచాయతీ లంకపాడు గిరిజన గ్రామానికి చెందిన మల్లిపురం పార్వతి అనే మహిళ కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. ఈమె చికిత్స కోసం కొద్దిరోజుల క్రితం.. విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రిలో చేరారు. కరోనా పరీక్ష నిర్వహించిన వైద్యులు పాజిటివ్ గా నిర్ధరించి.. ఆసుపత్రికి తరలించారు. పార్వతి 1వ తేదీన మృతి చెందినట్లు అధికారులు బుధవారం ప్రకటన విడుదల చేశారు. మృతురాలికి దహన సంస్కారాలు నిర్వహిస్తామని వెల్లడించారు.

కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు ఒక్కసారిగా ఆందోళనకు గురై కన్నీరుమున్నీరయ్యారు. నిజమో.. కాదోనని.. ఆమె నెంబర్​కు ఫొన్​ చేశారు.. తాను బాగానే ఉన్నానని పార్వతి చెప్పడంతో.. అధికారుల తీరుపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలు 'ఈటీవీ భారత్'తో ఫోన్​లో మాట్లాడారు. కాసేపటికే ఆసుపత్రి వర్గాలను సంప్రదిస్తే ఆ మహిళ ఈనెల 1వ తేదీన మృతి చెందినట్లు చెప్పడం విచిత్రం.

ఇదీ చదవండి: ఈ రామ భక్తులు.. రామదాసుకేం తీసిపోరు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.