విశాఖలో పండు ముదుసలి తల్లీ కుమార్తెలకు పింఛన్ కష్టం వచ్చింది. ఒకే రేషన్‌కార్డులో పేర్లు ఉన్నాయనే కారణంతో పింఛన్ నిలిపివేశారు. సింహాద్రిపురం కాలనీకి చెందిన కంటిబుక్త అప్పల నరసమ్మకు 110 ఏళ్ల వయసు. ఆమె కుమార్తె లక్ష్మికి 80 ఏళ్లు. ఇరువురూ ఓ పూరిగుడిసెలో నివసిస్తున్నారు. గతంలో ఇద్దరికీ పింఛన్ వచ్చినా..వేలిముద్రలు పడటం లేదంటూ అప్పల నరసమ్మకు కొన్నేళ్ల క్రితమే పింఛన్ నిలిపివేయగా.. ఈనెల నుంచి ఆమె కుమార్తెకూ పింఛన్ ఇవ్వలేదు.
ఇదీ చదవండి: