ETV Bharat / state

రాజయ్యపేటలో అంగరంగ వైభవంగా నూకతాత పండగ - రాజయ్యపేటలో నూకతాత పండగ ఘనంగా నిర్వహించిన మత్స్యకారులు

నూకతాత పండగను మత్స్యకారులు అంగరంగ వైభవంగా జరిపారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో జరిగిన ఈ వేడుకలకు.. భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ప్రతిమలను తీసుకువచ్చే సమయంలో భక్తులు వస్త్రాలు పరచి వాటిపై పడుకోగా.. పూజారులు వారి మీద నుంచి నడిచి వెళుతూ ఆశీర్వచనం ఇచ్చారు.

nookatata festival grand celebrations in rajaiahpeta
రాజయ్యపేటలో అంగరంగ వైభవంగా నూకతాత పండగ
author img

By

Published : Mar 13, 2021, 4:05 PM IST

రాజయ్యపేటలో అంగరంగ వైభవంగా నూకతాత పండగ

విశాఖ జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో.. మత్స్యకారుల కులదైవమైన నూకతాత పండగ ఘనంగా జరిగింది. బోయపాడు తీరం నుంచి 4 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతిమలను తీసుకువచ్చారు. భక్తులు దారిపొడవునా వస్త్రాలు పరిచి వాటిపై పడుకుని ఉండగా.. నూకతాతతో వచ్చే పూజారులు వారిపై నడిచి వెళుతూ ఆశీర్వదించారు. వేడుకను తిలకించడాని జనం వేలాదిగా తరలివచ్చారు. అందుకు తగినట్లుగా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.

జాతర వెనక కథేంటి?

పూర్వం గ్రామానికి ఓ సమస్య రాగా.. నూకతాత కాపాడినట్లు స్థానికులు చెబుతారు. శివరాత్రి సమయంలో ఆయన మరణించగా.. ప్రతి ఏటా తర్వాత రోజున జాతరం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆయన శివైక్యం చెంది.. ఊరిని రక్షిస్తున్నాడని మత్స్యకారులు నమ్ముతారు. నూకతాత ప్రతిమలకు ఏటా సముద్ర స్నానం చేయించి తిరిగి ఆలయంలో పెట్టే సమయంలో.. భక్తులు పడుకుని పూజారుల చేత తొక్కించుకుంటూ మొక్కులు తీర్చుకుంటారు. ఈ విధంగా చేస్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వసిస్తారు.

ఇదీ చదవండి:

పిచ్చికుక్కల స్వైర విహారం.. ఆరుగురికి గాయాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.