ETV Bharat / state

స్వచ్ఛంద సేవకులు.. కూలీలకు బస్సులు - విశాఖ జిల్లా వార్తలు

ఇతర రాష్ట్రాల నుంచి విశాఖ జిల్లా అనకాపల్లికి వలస వచ్చిన కూలీలు... చిన్నాచితకా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కరోనా లాక్​డౌన్​ వారి ఉపాధిపై దెబ్బకొట్టింది. తినడానికి తిండిలేక.. స్వస్థలాలకు వెళ్లేందుకు డబ్బులేక ఇబ్బందులు పడుతున్నారు. వలసకూలీల కష్టాలు చూసి వారిని ఆదుకునేందుకు అనకాపల్లికి చెందిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. కూలీలను వారి గ్రామాలకు తీసుకెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేశారు.

స్వచ్ఛంద సేవలు.. కూలీలకు బస్సులు
స్వచ్ఛంద సేవలు.. కూలీలకు బస్సులు
author img

By

Published : May 30, 2020, 12:19 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన సమాలోచన, బాషా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు హోమియో వైద్యులు శశిధర్, యోగ ప్రియ.. అనకాపల్లిలోని వలస కూలీలను ఆదుకున్నారు. అజీమ్ ప్రేమ్ జీ, ఫిలాంత్రఫిక్ ఇనీషియేటివ్, లిబిటిక్ ఇండియా ఆర్థిక సాయంతో వలస కార్మికులకు స్వగ్రామాలకు వెళ్లేందుకు వాహనాన్ని ఏర్పాటు చేశారు.

విశాఖ జిల్లా అనకాపల్లిలో పశ్చిమబంగాకు చెంది 13 మంది మగ్గం పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. లాక్​డౌన్​ వల్ల ఉపాధి కోల్పోయారు. గ్రామానికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న వీరికి స్వచ్ఛంద సంస్థలు ప్రైవేట్ వాహనం ఏర్పాటు చేశాయి. అనకాపల్లి పట్టణ సీఐ భాస్కరరావు ఆధ్వర్యంలో వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపారు.

ఒడిశా, ఝార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బంగా ప్రాంతాలకు చెందిన 1250 మందిని వారి సొంత ఊళ్లకు పంపామని స్వచ్ఛంద సంస్థ సభ్యుడు శశిధర్ తెలిపారు.

ఇదీ చదవండి:

ఏడాది పాలనలో ఎవరికేం ఒరగబెట్టారని ఉత్సవాలు?: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.