విశాఖ-తూర్పుగోదావరి జిల్లాలను కలిపే తాండవ నది వంతెనపై నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కానీ ఈ వంతెనపై విద్యుత్ దీపాలు లేక వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. చీకటి కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రిపూట ప్రయాణించాలంటే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఆర్ అండ్ బీ, పంచాయతీ అధికారులు స్పందించి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
ఇదీ చదవండి :