ETV Bharat / state

కార్మికుల్లో ఆందోళన: కళ తప్పుతున్న అనకాపల్లి బెల్లం మార్కెట్‌ - Visakha District Latest News

విశాఖ జిల్లాలోని అనకాపల్లి బెల్లం మార్కెట్‌ కళ తప్పుతోంది. ఇప్పటికే ఉన్న సమస్యలకు కరోనా తోడై... అంతకంతకూ లావాదేవీలు కుంటుపడుతున్నాయి. వేల మందికి ఉపాధి కల్పించే బెల్లం మార్కెట్‌ కష్టాల్లో చిక్కుకోవడం... వ్యాపారులు, కార్మికుల్లో ఆందోళన రేపుతోంది. వచ్చే ఏడాది ఎలా ఉంటుందోననే దిగులు ఇప్పుడే కనిపిస్తోంది.

అనకాపల్లి బెల్లం మార్కెట్
అనకాపల్లి బెల్లం మార్కెట్
author img

By

Published : Apr 19, 2021, 6:11 AM IST

అనకాపల్లి బెల్లం మార్కెట్

కరోనా పరిస్థితుల మధ్య విశాఖ జిల్లాలోని ప్రఖ్యాత అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో వ్యాపారం మందగించింది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ మార్కెట్‌లో నెలాఖరుకు సీజన్‌ ముగియనుండగా... 3లక్షల దిమ్మలు తక్కువగా వచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఏటా వంద కోట్ల రూపాయల బెల్లం అమ్మకాలు జరిగే చోట... ఇప్పటివరకూ 77 కోట్ల 53 లక్షల రూపాయల లావాదేవీలు మాత్రమే జరగడం పరిస్థితికి నిదర్శనం. గతేడాది కరోనా వల్ల మార్చి, ఏప్రిల్‌లో బెల్లం అమ్మకాలకు అవరోధం ఏర్పడింది. ఈ ఏడాదైనా పరిస్థితి చక్కబడుతుందనుకుంటే మరింత క్షీణించింది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మున్ముందు పరిస్థితులు మరింత దుర్భరంగా మారుతాయని... మార్కెట్‌పై ఆధారపడి జీవనం సాగించేవారు ఆందోళన చెందుతున్నారు.

అనకాపల్లి బెల్లం మార్కెట్‌ జాతీయ స్థాయిలోనే రెండో స్థానంతో ప్రసిద్ధి పొందింది. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి రైతులు ఇక్కడికి బెల్లం తీసుకొచ్చి అమ్మకాలు జరుపుతారు. మార్కెట్ కమిటీ అధికారుల పర్యవేక్షణలో బీటు నిర్వహించి బెల్లం ధర నిర్ణయిస్తారు. కోల్డ్ స్టోరేజ్‌లో బెల్లం ఉంచి దేశంలోని వివిధ రాష్ట్రాలతో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తారు. ఏటా మార్కెట్‌కు వచ్చే దిమ్మల సంఖ్య తగ్గడం ఆందోళన రేపుతోంది.

ఇదీ చదవండీ...కరోనా ఎఫెక్ట్: పిల్లల్ని బడికి పంపేందుకు భయపడుతున్న తల్లిదండ్రులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.