ETV Bharat / state

'గ్లోబల్ సమ్మిట్' పేరుతో చిరు వ్యాపారుల పొట్ట కొడుతున్నారు: టీడీపీ - Visakhapatnam District updated news

Visakhapatnam Global summit, G-20 meetings updates: విశాఖపట్నంలో వచ్చే నెలలో గ్లోబల్ సమ్మిట్, జీ-20 సదస్సులు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు గ్లోబల్ సమ్మిట్ పేరుతో తాజాగా రోడ్డుకు ఇరువైపులా వ్యాపారం చేస్తూ.. జీవనం సాగిస్తున్న తోపుడుబళ్లను, చిరు వ్యాపారాలను తొలగించారు. సమ్మిట్ పేరుతో అధికారులు చేపట్టిన తొలగింపులు వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ.. తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన చేపట్టారు.

tdp
tdp
author img

By

Published : Feb 8, 2023, 6:09 PM IST

Updated : Feb 8, 2023, 7:35 PM IST

Visakhapatnam Global summit, G-20 meetings updates: విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్, 28, 29 తేదీల్లో జీ-20 సదస్సులు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు గ్లోబల్ సమ్మిట్ పేరుతో తాజాగా రోడ్డుకు ఇరువైపులా వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న తోపుడు బళ్లను, చిరు వ్యాపారాలను తొలగించారు. సమ్మిట్ పేరుతో అధికారులు తోపుడు బళ్లను, చిరు వ్యాపారాలను తొలగించడం అన్యాయమని.. ఆ తొలగింపులను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ.. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జీ-20 పేరుతో అధికారులు తొలగిస్తున్న తోపుడు బళ్లు, చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో ఫ్లీట్ రివ్యూ సందర్భంగా ఆనాడూ మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్పి.. ఆ సమయంలో వారికి జీవన భృతి ఇచ్చామని గుర్తు చేశారు. మార్చిలో జరగబోయే జీ-20 సదస్సులకు తాము వ్యతిరేకం కాదని, కానీ సదస్సుల పేరుతో అధికారులు పేదల పొట్టను కొట్టడాన్ని మాత్రం టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు.

అనంతరం మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి మాట్లాడుతూ.. తోపుడు బళ్లు తొలగించిన తర్వాత.. ఆ భూములను అమ్ముకుంటారేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. తోపుడు బళ్ల యజమానులకు, చిరు వ్యాపారులకు న్యాయం చేసేవరకూ నిరసన కొనసాగిస్తామన్నారు. అధికారులు స్పందించి చిరు వ్యాపారులు.. వారి వ్యాపారాన్ని కొనసాగించేందుకు ఎదైనా స్థలాన్ని కేటాయించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్నానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. తమ నిరసనను తెలియజేశారు.

'గ్లోబల్ సమ్మిట్' పేరుతో చిరు వ్యాపారుల పొట్ట కొడుతున్నారు

వచ్చే నెలలో విశాఖలో జరగబోయే జీ-20 సదస్సు, ఇండస్ట్రీయల్ సమ్మిట్‌ల సందర్భంగా ఈ ప్రభుత్వం చిరు వ్యాపారస్తులైనా స్ట్రీట్ వెండర్స్, హ్యకర్స్, తోపుడు బళ్లు ఉన్నవారికి తీవ్ర అన్యాయం చేస్తుంది. దానిని నిరసిస్తూ..ఈరోజు గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టాము. అధికారులు తొలగిస్తున్న తోపుడు బళ్ల యజమానులకు, చిరు వ్యాపారులకు న్యాయం చేయాలి.-పల్లా శ్రీనివాసరావు , టీడీపీ నేత

ఇటీవలే రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సదస్సులకు సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించారు. అంతర్జాతీయ సదస్సులకు విశాఖ వేదిక కానుందని, ఈ ఏడాది మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్, 28, 29 తేదీల్లో జీ -20 సదస్సులు జరగనున్నాయని తెలిపారు. మరింత పెట్టుబడులు ఏపీలో పెట్టించే క్రమంలో పరిశ్రమల శాఖ ప్రయత్నిస్తోందని, 48 దేశాలకు చెందిన ప్రతినిధులు సదస్సుకు హాజరు కానున్నట్టు పేర్కొన్నారు. ఆ సదస్సులకు దేశంలోని వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు రానున్నారని వివరించారు.

ఇవీ చదవండి

Last Updated : Feb 8, 2023, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.