ETV Bharat / state

తెలుగు, గిరిజన భాషల సమ్మిళితం... ఇస్తోంది మంచి ఫలితం... - విశాఖ మన్యంలో విద్య న్యూస్

మన్యంలో చదువు చెప్పాలంటే కత్తి మీద సామే... ఆటపాటలు నేర్పాలన్నా సమస్యే. అర్థంకాని భాషలు వారిని తికమక పెడుతుంటాయి. గిరిజనుల్లో నిరక్షరాస్యతకు ఇదే ప్రధాన కారణం. దీన్ని గుర్తించిన గిరిజన సంక్షేమ శాఖ వినూత్న ఆలోచనతో ముందుకు సాగుతోంది. ప్రాంతీయ భాషల ద్వారానే అక్షరాస్యత పెంచే ప్రక్రియను నేచర్ సంస్థకు అప్పగించి మంచి ఫలితాలు సాధిస్తోంది.

new-education
author img

By

Published : Nov 21, 2019, 1:02 PM IST

తెలుగు, గిరిజన భాషల సమ్మిళితం... ఇస్తోంది మంచి ఫలితం...

ఆంధ్ర, ఒడిశా సరిహద్దు గ్రామాల్లో చాలావరకు ప్రాంతీయ భాషలే ఉంటాయి. కొన్ని గిరిజన భాషలకు లిపి ఉండదు. చిన్నతనం నుంచి ఆయా భాషలే నేర్చుకున్న గిరిపుత్రులకు తెలుగు పూర్తిగా తెలియదు. మిగతా ప్రాంతాలతో పోటీ పడలేక... తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు ఇక్కడి ప్రజలు. దీన్ని గుర్తించిన గిరిజన సంక్షేమ శాఖ... వారి బాధ్యతను నేచర్ సంస్థ ఎంఈజీకు అప్పగించింది.

కొండ భాషలు మాట్లాడే కొన్ని గ్రామాలను నేచర్ సంస్థ దత్తత తీసుకుని... ప్రాంతీయ భాషలతో తెలుగును మిళితం చేసి ప్రత్యేకపాఠాలు, ప్రణాళికలు రూపొందించింది. 2009 నుంచి 70 క్లస్టర్ పాఠశాలలో ఈ ప్రాజెక్టుని అమలు చేసి విజయం సాధించారు. ప్రస్తుతం 20 క్లస్టర్లలో ప్రాంతీయ భాషల్లో విద్యా విధానం కొనసాగుతోంది. పాఠశాలకు సంబంధించిన ప్రత్యేక పుస్తకాలు, ఆట వస్తువులు అందజేసి పాఠాలు బోధిస్తున్నారు.

పాఠ్య పుస్తకాలు తెలుగులోనే ఉన్నందున విద్యార్థులకు అర్థంకాని పరిస్థితి. వారికి ఎలా చెప్పాలో ఉపాధ్యాయులకూ తెలియని దుస్థితి. ఇటువంటి స్థితిలో నేచర్‌ సంస్థ అన్ని రకాలుగా తోడ్పాటునందిస్తోంది. ప్రాంతీయ భాషల్లో తెలుగు అనువాదం చేసి ప్రతి పాఠశాలలోనూ భాషా వలంటీర్లను నియమిస్తే మన్యంలో అక్షరాస్యత పెరిగే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

పృథ్వీ-2 క్షిపణి పరీక్ష విజయవంతం

Intro:ap_vsp_76_20_konda_bhashallo_aatapastala_chaduvulu_paderu_pkg_avb_ap10082

శివ, పాడేరు
యాంకర్: కొండ ప్రాంతాల్లో చదువులు చెప్పాలంటే కత్తి మీద సామే... ఆటపాటలు నేర్పాలన్నా అర్థంకాని భాషలు. విద్యార్థులు చదువులో ముందుకు సాగాలన్నా శ్రద్ధ పెట్టలేని విద్య. మారుమూల గిరిజన గుడాల్లో వెనుకబాటుతనాన్ని గుర్తించిన గిరిజన సంక్షేమ శాఖ, సర్వ శిక్ష అభియాన్ ఆ బాధ్యతను నేచర్ సంస్థకు అప్ప చెప్పింది ప్రాంతీయ భాషల్లో ముందుకు తీసుకు వెళ్తూ విద్యార్థులను అడుగులు వేయి స్తోంది విశాఖ మన్యం మారుమూల ఆంధ్ర సరిహద్దులో ఆటపాటల చదువు పై ప్రత్యేక కథనం......

వాయిస్1) విశాఖ మన్యం కొండ కోనల సమూహల ప్రాంతం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు లో చాలా గ్రామాలు ప్రాంతీయ భాషల్లో ఉంటాయి. కొన్ని గిరిజన తెగలు ఆంధ్ర ఒడియా, కువి కొండ ఒడియా భాషలు వారి అమ్మ భాష దీంతో ఆయా ప్రాంతాల్లో వారి వారి భాషలోనే మాటలుంటాయి. వీరి భాషలకు లిపి ఉండదు. చిన్నతనం నుంచి ఆయా భాషలు నేర్చుకోవడం తో మారుమూల కొండ ప్రాంతాల్లో ఆంధ్ర అమ్మ భాష తెలుగు తెలియనే తెలియదు మాట్లాడరు కూడా. ప్రధాన కేంద్రాలు పట్టణ కేంద్రాల్లో వచ్చినప్పుడు మౌనంగా ఉండి పోతారుమ్ కలిసికట్టుగా వచ్చినప్పుడు వారి భాషలోనే మాట్లాడుకుంటారు దీనిని గుర్తించిన గిరిజన సంక్షేమ శాఖ సర్వ శిక్ష అభియాన్ ఆ బాధ్యతను నేచర్ సంస్థ ఎం ఈ జి ఫైర్ ప్రాజెక్ట్స్ కు అప్పగించారు.
బైట్: బాలరాజు, నేచర్, ప్రాజెక్టు డైరెక్టర్
..........
వాయిస్2) కొండ ప్రాంతీయ భాషలు మాట్లాడే కొన్ని గ్రామాలను నేచర్ సంస్థ దత్తత తీసుకుంది ప్రాంతీయ భాషలతో పాటు తెలుగు భాషను మిలితం చేసి ప్రత్యేక పాఠ్యాంశాలు, ప్రణాళికలు తయారు చేశారు. 2009 నుంచి 70 క్లస్టర్ పాఠశాలలో ఈ ప్రాజెక్టుని అమలు చేసి విజయం సాధించారు. ప్రస్తుతం నేచర్ ఆధ్వర్యంలో 20 క్లస్టర్లలో ప్రాంతీయ భాషల్లో విద్యా విధానం కొనసాగుతోంది.
పాఠశాలలో ఆటపాటలతో విద్యా సామగ్రితో పాటలు బోధించడం తో విద్య పై శ్రద్ధ పెరిగి పాఠశాలలకు వచ్చే విద్యార్థులు సంఖ్య పెరిగింది దిబడి మానేసే విద్యార్థుల సంఖ్య తగ్గింది.పాఠశాల కు సంబంధించిన ప్రత్యేక పుస్తక, వస్తువుల , చార్ట్లు లు క్రీడ సామగ్రి అందజేసి పాఠాలు బోధించడం మొదలుపెట్టారు. ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రతి పాఠశాలకు వాలంటీర్లను నియమించారు. ప్రతిరోజు ఆటపాటలతో నృత్యాలతో ప్రాంతీయ భాషల్లో పట్టున్న వాలంటీర్లు విద్యార్థులకు విద్యాభ్యాసం పై శిక్షణ ఇచ్చారు. పిల్లల్లో వారి భాషలోనే తర్జుమా చేసి తెలుగు పాఠాలు నేర్చుకోవడమ్ తో ప్రతిరోజు పాఠశాలలో విద్యార్థులు క్రమం తప్పకుండా వస్తున్నారు. చదువుపై శ్రద్ధ పెరిగి జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు
బైట్: రాఘవేంద్రరావు, ఉపాద్యాయుడు, కమలబంద, డుంబ్రిగుడ మండలం

వాయిస్3) ఆంధ్ర రాష్ట్ర పాఠ్య పుస్తకాలు తెలుగులోనే ఉండడం తో విద్యార్థులకు అర్థంకాని పరిస్థితి. ఆ భాషలో తెలియని ఉపాధ్యాయులు కూడా వారితో ఎలా మాట్లాడాలో ఎలా పాటలు చెప్పా లో తెలియని దుస్థితి. ఇటువంటి దశలో ప్రాంతీయ భాషల్లో చదువులు, క్రీడలు, ఆట పాటలు ముందుకు తీసుకెళుతున్న విద్యార్థుల ప్రతిభ పెరుగుతుంది ఉపాధ్యాయులు కూడా చదువు సులభతరమవుతుంది.

బైట్: ఉమామహేశ్వరి దేవి, ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయురాలు
సోవ్వా, డుంబ్రిగుడ మండలం

వాయిస్3) గిరిజన గూడాల్లో తల్లిదండ్రులు వ్యవసాయం అటవీ ఉత్పత్తుల సేకరణలో ఎక్కువ గడుపుతుంటారు. దీంతో వారి పిల్లలను కూడా ప్రతిరోజు పనులు నేర్పిస్తున్నారు దీంతో మారుమూల ప్రాంతాల్లో పిల్లలు పాఠశాలకు వెళ్లలేరు ఒకవేళ వెళ్ళినా క్రమం తప్పకుండా హాజరు కారు ప్రాంతీయ భాషల్లో క్రీడా పరికరాలు వస్తు , సామగ్రి ,చాట్ లు ఆట పాటలు వారి భాషల్లో చదువులో ఉండటంతో విద్యార్థులే ఇళ్లను వదిలి పాఠశాలకు పరుగులు తీస్తున్నారు. కొండ ఒడియా కువి ఆంధ్ర ఒడియా భాషల్లో నే పుస్తకాలు పట్టనుండటంతో విద్యార్థుల్లో ప్రతిభ పెరుగుతుంది.
బైట్: కృష్ణ, సోవ్వా, డుంబ్రిగుడ మండలం
బైట్: విద్యార్థులు....
బైట్: విద్యార్థులు
వాయిస్4) విద్యార్థులు లు మానసిక పరిణితి పెంచడానికి ఆటపాటల శారీరక దారుఢ్యం పెంపొందించేందుకు ప్రాంతీయ భాషల్లో చదువులు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి రాష్ట్రవ్యాప్తంగా ఐటీడీఏ పరిధిలో ఆటపాటల చదువులు అమలుచేసేందుకు నేచర్ సంస్థ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. స్థానిక నృత్యం దింసా కూడా విద్యార్థులకు నేర్పిస్తున్నారు
బైట్: బాలరాజు, ప్రాజెక్టు డైరెక్టర్, నేచర్ సంస్థ
ఎండ్ వాయిస్:) ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన పాఠశాలలో ఇంగ్లీష్ బోధనలు మంచివే కానీ విశాఖ మన్యంలో మాత్రం ప్రాంతీయ భాషల్లో తెలుగు అనువాదం చేసి ప్రతి పాఠశాలలోనూ భాష వలంటీర్లను నియమిస్తే మన్యంలో చదువులు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది
శివ , పాడేరు

Body:శివ

Conclusion:9493274036
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.