Navratri 2023 in Andhra Pradesh : రాష్ట్రంలో దేవీశరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి ఆలయాలకు భక్తులు పొటెత్తుతున్నారు. బాలా త్రిపుర సుందరి అలంకారంలో తణుకు వాసవి కన్యకా పరమేశ్వరి.. విశాఖ శ్రీ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజూ అమ్మవారు మహేశ్వరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు అమ్మవారి అలంకరణకు హారతులిచ్చి పూజలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ అమ్మవార్ల ఆలయాల్లో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఇంద్రకీలాద్రిపై మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు దర్శనాలు నిలిపివేత
Dussehra 2023 : శ్రీ కనకదుర్గ అమ్మవారు బాలా త్రిపుర సుందరీ రూపంలో.. తణుకు గోస్తని తీరాన వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారు బాలా త్రిపుర సుందరీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వర ప్రదాయనిగా అభయ హస్తం, స్పటిక మాల, పుస్తకం, కలువ ధరించి చతుర్భుజి రూపిణిగా భక్తుల పూజలందుకుంటున్నారు. ఈ రూపంలో అమ్మవారిని కొలిస్తే మానసిక ప్రశాంతత, నిత్యసంతోషాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శనానికి దేవస్థానం పాలకవర్గంల భక్తులకు అన్ని సదుపాయాలు అందేలా ఏర్పాట్లు చేసింది.
వైభవంగా శరన్నవరాత్రులు.. మహాలక్ష్మి అమ్మవారిగా దర్శనం
Ammavari Alankaraalu : ఏకవీర దేవిగా శ్రీ ఎల్లారమ్మ అమ్మవారు.. మండపాక గ్రామంలో శ్రీ ఎల్లారమ్మ అమ్మవారి ఆలయంలో ఉత్సవాలు కలశస్థాపనతో ప్రారంభమయ్యాయి. రెండో రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని స్వర్ణాభరణ భూషితురాలిగా తీర్చిదిద్దారు. ఏకవీర దేవి అంశతో వెలసిన అమ్మవారిని శరన్నవరాత్రి రోజుల్లో దర్శించుకుంటే సర్వ శుభాలు జరుగుతాయని భక్తులు నమ్ముతారు.
Ammavari Rupalu : మహేశ్వరి అవతారంలో రాజశ్యామల అమ్మవారు.. బాపట్ల పట్టణంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు బాపట్ల నియోజకవర్గాలలో మండలాల్లో ఆలయాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి అమ్మవార్లకు స్థాపన కార్యక్రమం అఖండ దీపారాధన అనంతరం అలంకరణ నిర్వహించారు తొలిరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు దేవీ నవరాత్రి వైభవం పై ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలను నిర్వహించారు బాలికలను బాల త్రిపుర సుందరిగా అలంకరించి బాల పూజ చేశారు పలుచోట్ల అమ్మవార్లను స్వర్ణకవచంతో అలంకరించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాల ప్రారంభించారు బతుకమ్మను రైలు పేట శివాలయం ప్రాంగణం వరకు ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేవీ నవరాత్రులు.. తొమ్మిది రోజులు 9 వస్త్రాలు ధరించాలి.. అవేంటో మీకు తెలుసా..?