విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలంలో నాటుసారా బట్టీలపై పోలీసులు దాడులు నిర్వహించారు. భారీగా బెల్లం ఊట.. నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. వాలాబు పంచాయతీ నగరంపాలెం గ్రామ సరిహద్దుల్లో నాటుసారా తయారీ బట్టీలను కూల్చేశారు. 5 వేల లీటర్ల బెల్లం ఊటను గుర్తించి పారబోశారు. సారా తయారీ సామగ్రి, షెడ్ పూర్తిగా ధ్వంసం చేశారు.
అనంతరం నగరంపాలెం, మూకనపల్లి గ్రామాలకు చెందిన ఐదుగురు వ్యక్తుల నుంచి 160 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.