ETV Bharat / state

దిగ్విజయంగా ముగిసిన నారా లోకేశ్ యువగళం పాదయాత్ర - భారీగా తరలివచ్చిన తెదేపా, జనసేన శ్రేణులు - Nara Lokesh comments

Nara Lokesh Yuvagalam Padayatra End: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'యువగళం' పాదయాత్ర ముగిసింది. దీంతో అనకాపల్లి జిల్లా అగనంపూడి వద్ద ఏర్పాటు చేసిన భారీ పైలాన్‌ను లోకేశ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన టీడీపీ, జనసేన శ్రేణులతో ఆ ప్రాంతం పసుపుసంద్రాన్ని తలపించింది.

lokesh yuvagalam
lokesh yuvagalam
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 18, 2023, 8:15 PM IST

Nara Lokesh Yuvagalam Padayatra End: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర నేటితో (సోమవారం) ముగిసింది. ఈ ఏడాది జనవరి 27వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన 'యువగళం' పాదయాత్ర ఈరోజు అనకాపల్లి జిల్లా అగనంపూడిలో ముగిసింది. పాదయాత్రలో భాగంగా యువనేత నారా లోకేశ్ రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లోని 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు/మున్సిపాలిటీలు, 2,028 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు, 3,132 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాలోని ప్రజలు, మహిళలు, కార్యకర్తలు, యువత పెద్దఎత్తున ఆయనకు మద్దతు పలికారు.

Yuvagalam End Updates: టీడీపీ యువనేత నారా లోకేశ్ "యువగళం" పాదయాత్ర సోమవారంతో దిగ్విజయంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆయన అనకాపల్లి జిల్లా అగనంపూడిలో భారీ పైలాన్ ఆవిష్కరించారు. కుప్పంలో మొదలైన లోకేశ్ పాదయాత్ర 226 రోజుల పాటు 3 వేల 132 కిలోమీటర్ల మేర సాగింది. పాదయాత్రకు వైసీపీ ప్రభుత్వం, పోలీసులు, అధికార పార్టీ నాయకులు ఎన్ని అడ్డంకులు, ఆంక్షలు విధించినా యువనేత లోకేశ్ వాటిన్నింటినీ అధికమించి, ఈరోజు దిగ్విజయంగా పాదయాత్రను ముగించారు. అంతేకాదు, పాదయాత్రలో ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, బాధితులకు తాను అండగా ఉన్నానంటూ భరోసానిస్తూ ముందుకు సాగారు.

కోలాహలంగా యువగళం పాదయాత్ర - లోకేశ్‌ వెంట నడిచిన భువనేశ్వరి, కుటుంబ సభ్యులు

Lokesh Inaugurated Huge Pylon at Aganampudi: యువనేత నారా లోకేశ్ తాను చేపట్టిన 'యువగళం' పాదయాత్ర ముగింపునకు గుర్తుగా అనకాపల్లి జిల్లా అగనంపూడి వద్ద ఏర్పాటు చేసిన భారీ పైలాన్‌ను, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో ముగింపు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, అయన్న పాత్రుడితో పాటు సీనియర్ నేతలు, వేలాదిగా కార్యకర్తలు, భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. వీరితోపాటు నందమూరి, నారా కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు "వస్తున్నా మీకోసం" పాదయాత్రను అగనంపూడి వద్దే ముగించారు. ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో చంద్రబాబు తనయుడు లోకేశ్ సైతం యువగళం పాదయాత్రను అగనంపూడి వద్దే ముగించేశారు.

Nara Lokesh Comments: ''యువగళం పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అసమర్థుడు గద్దెనెక్కి ప్రజాస్వామ్యంపై దాడి చేశాడు. ప్రజాస్వామ్యం, వ్యవస్థలపై చేసిన దాడిని కళ్లారా చూశాను. భవిష్యత్‌పై ఆశలు కోల్పోయిన యువతకు భరోసానిచ్చాను. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీలకు కట్టుబడి ఉంటాను. నియంతృత్వంపై ప్రజా యుద్ధమే ఈ యువగళం పాదయాత్ర. యువగళం అణచివేతకు గురైన వర్గాల గొంతుకైంది. యువగళం-ప్రజాగళమై నిర్విరామంగా కొనసాగింది. యువగళాన్ని విజయవంతం చేసిన రాష్ట్ర మహిళలు, యువత, విద్యార్థులు, రైతులు, కార్మికులు, పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు.'' అని టీడీపీ యువనేత నారా లోకేశ్ అన్నారు.

నిరుద్యోగులకు హామీ ఇస్తున్నాం-పెద్దఎత్తున పరిశ్రమలు తెస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం: నారా లోకేశ్

Yuvagalam Vijayotsava Sabha on Dec 20: యువగళం పాదయాత్ర విజయోత్సవం సభ విషయానికొస్తే, ఈ నెల (బుధవారం) 20వ తేదీన విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద విజయోత్సవ సభ జరగనుంది. ఈ సభకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలు హాజరు కాబోతున్నారు. ఈ సభ వేదికపై నుంచే ఇరు పార్టీల అధినేతలు ఉమ్మడిగా సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. 110 ఎకరాల్లో నిర్వహించనున్న ఈ సభకు సుమారు 6 లక్షల మంది ఇరు పార్టీల శ్రేణులు రానున్నారు. అందుకు తగ్గట్టు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే 7 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.

Yuvagalam Padayatra Last Day Updates: ఇక, యువగళం పాదయాత్ర చివరి రోజున ఉత్సాహంగా సాగింది. యువనేత లోకేశ్ తన తల్లి భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి అడుగులు వేశారు. ఈ క్రమంలో లోకేశ్‌కు మద్దతుగా స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు ప్లకార్డులు పట్టుకుని తరలివచ్చారు. ప్రజా సమస్యల తెలుసుకుంటూ ముందుకెళ్లిన యువనేతకు, అడుగడుగనా ప్రజలు నీరాజనాలు పలికారు. జీవీఎంసీ (GVMC) దుర్గానగర్ బస్టాప్ వద్ద భావనారుషి మార్కండేయ పద్మశాలి సేవా సంఘం ప్రతినిధులు లోకేశ్‌ను కలిసి, వినతిపత్రం అందజేశారు. జీవీఎంసీ జగ్ జంక్షన్ వద్ద గాజువాక ప్రగతి టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఆయన ముందు సమస్యల చిట్టా విప్పారు. టూ వీలర్‌ మెకానిక్‌లకు గుర్తింపు ఇవ్వాలని, హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు.ఎస్‌ఎఫ్‌ఎస్ (S.F.S) స్కూలు వద్ద సూర్యదుర్గా కళాసీల సంక్షేమ సంఘం ప్రతినిధులు యువనేతను కలిసి, వినతిపత్రం అందజేశారు.

నియంతృత్వంపై ప్రజా యుద్ధమే యువగళం. అణిచివేతకు గురైన వర్గాలకు యువగళం గొంతుకైంది. ప్రజాగళమై, ప్రజలే బలమై 226 రోజులు, 3132 కి.మీ పాదయాత్ర నిర్విరామంగా కొనసాగింది. ప్రజాస్వామ్యంపై దాడి, వ్యవస్థల విధ్వంసాన్ని నేను కళ్లారా చూశాను. ఆశలు కోల్పోయిన యువతకు యువగళం ద్వారా భరోసానిచ్చాను. అందరీ సహకారంతో యువగళం పాదయాత్రను దిగ్విజయంగా అగనంపూడి వద్ద ముగించాను. నేను ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంటా, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి హామీని నిలబెట్టుకుంటా. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.-నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

Nara Lokesh Yuvagalam Padayatra: 'టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతిఏటా నోటిఫికేషన్లు.. గిరిజన యువతకు ఉద్యోగావకాశాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.