రాష్ట్రంలో ప్రతిపక్షాలు అధికారంలోకి రావడం కలయేనని వైకాపా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సుపరిపాలన అందిస్తున్న జగన్ సీఎంగా మరో ఇరవైఏళ్లు ఉంటారని ఆయన అన్నారు. విశాఖ జిల్లా చోడవరంలో ఇళ్లస్థలాల పంపిణీ కార్యక్రమంను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌తో కలిసి విజయసాయిరెడ్డి చేపట్టారు.
ప్రజాప్రతినిధులే కారణం
విశాఖ జిల్లా తగరపువలస బంతాట మైదానంలో ఇళ్లస్థలాలు అర్హత పత్రాలు పంపిణీ సభలో తెదేపా నాయకులపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ భూముల రికార్డులు అవకతవకలకు ప్రజాప్రతినిధులే కారణమని విజయసాయిరెడ్డి విమర్శించారు. పట్టాలు లబ్దిదారులు పేరిట ఉన్నప్పటికి వెబ్ ల్యాండ్‌లో నచ్చిన వాళ్ల పేర్లు మార్చుకుని రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఎంపీ ఆరోపించారు.
ఇదీ చదవండి: