ETV Bharat / state

Visakhapatnam Suburbs Murder విశాఖ శివార్లలో తల్లీకుమారుల హత్య - Atrocious

Visakhapatnam Suburbs: విశాఖపట్నం నగర శివారులో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు తల్లీకుమారులను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. కుమారుడి కాళ్లు చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలుకుక్కి ఊపిరాడకుండా చేసి చంపేశారు. తల్లీని గొంతు కోసి హత్య చేశారు. ఆధారాలు దొరకకుండా హత్య ప్రదేశంలో నిందితులు కారం చల్లారని పోలీసులు తెలిపారు.

Mother and Son
తల్లీకుమారుల హత్య
author img

By

Published : Sep 9, 2022, 12:19 PM IST

Murder In Visakha: విశాఖ నగర శివారు మదీనాబాగ్‌ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో గురువారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు తల్లీకుమారులను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఉదంతం సంచలనం సృష్టించింది. కుమారుడి కాళ్లూ చేతులూ కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి, ఊపిరాడకుండా చేసి చంపేశారు. అతని తల్లిని గొంతుకోసి హత్య చేశారు. ఇల్లంతా నెత్తుటి మడుగులా.. ఒళ్లు గగుర్పొడిచేలా ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

మదీనాబాగ్‌ ప్రాంతానికి చెందిన మంగి గౌరమ్మ (55) జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బ్లాక్‌ నంబరు 3లో నివసిస్తోంది. ఆమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భర్త మరణించడంతో మదీనాబాగ్‌ మద్యం దుకాణం దగ్గర మిర్చి, మసాలా, చీకులు తదితరాలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. గౌరమ్మ రెండో అంతస్తులోనూ, అదే అంతస్తులోని మరో ఫ్లాట్‌లో ఆమె రెండో కుమారుడు పోలారెడ్డి (35) నివసిస్తున్నారు. మూడో కుమారుడు అదే బ్లాక్‌లో పైఅంతస్తులో తన కుటుంబంతో నివసిస్తున్నారు. గౌరమ్మ కుమార్తె దుబాయిలో ఉంటున్నారు. పెద్ద కుమారుడు కుటుంబంతో నగరంలో నివసిస్తున్నారు. మూడో కుమారుడు పనుల నిమిత్తం ప్రతి నెలా కొన్నిరోజులపాటు ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తుంటారు. పోలారెడ్డి పెళ్లి చేసుకోలేదు. తల్లికి చేదోడువాదోడుగా ఉంటున్నారు.

గౌరమ్మను హత్య చేయటానికి గురువారం ముగ్గురు నిందితులు వెళ్లారు. ఆమె ఇంటి తలుపు తట్టారు. తల్లి కోసం ఎవరు వచ్చారా అని అదే అంతస్తులో నివసిస్తున్న పోలారెడ్డి కూడా తన ఫ్లాట్‌ తలుపు తెరిచాడు. హంతకులు ముందుగా అతణ్ని పట్టుకున్నారు. అప్పుడే తలుపు తెరిచిన గౌరమ్మపైనా దాడి చేశారు. పోలారెడ్డిని ఆమె తల్లి ఉంటున్న ఫ్లాట్‌లోకి లాక్కెళ్లారు. గౌరమ్మ గొంతు కోసి హత్య చేశారు. దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలారెడ్డి కాళ్లూ, చేతులూ కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.

కీలక ఆధారాలు లభ్యం?

రెండో అంతస్తులో హత్యలు జరిగినప్పటికీ నిందితుల సంచారాన్ని ఆ బ్లాక్‌లోని వారు గానీ, స్థానికులు గానీ గుర్తించలేకపోయారు. సంఘటన స్థలానికి సమీపంలో ఎక్కడా నిఘా కెమెరాలు కూడా లేకపోవడంతో నిందితుల ఆచూకీ తెలియరాలేదు. పోలీసు ఉన్నతాధికారులు, క్లూస్‌ టీంలు, డాగ్‌ స్క్వాడ్‌తో వచ్చి పరిశీలించారు. కుటుంబసభ్యుల్ని విచారించగా కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా హత్య ఎందుకు జరిగిందన్న విషయంపై పోలీసు ఉన్నతాధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. కొందరు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

పక్కదోవ పట్టించేందుకు కారం చల్లారు

తల్లీకుమారులు నివసిస్తున్న రెండు ఫ్లాట్లలోనూ నేలపై కారం చల్లి ఉండటం గమనార్హం. సీపీ శ్రీకాంత్‌, శాంతిభద్రతల విభాగం డీసీపీ సుమిత్‌ సునీల్‌, క్రైం డీసీపీ నాగన్న, క్రైం ఏడీసీపీ గంగాధరం తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పక్కా ప్రణాళికతోనే హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. తమను పక్కదోవ పట్టించేందుకే కారం చల్లారని గుర్తించారు. ఒకచోట కారం డబ్బా మూతపడి ఉండడాన్ని గుర్తించిన సీపీ దాని డబ్బా ఎక్కడుందోనని పరిశీలించగా మూడో కుమారుడి ఇంట్లో మూతలేని కారం డబ్బా కనిపించింది. దీంతో అక్కడ ఉన్న కోడలిని విచారణ చేయాలని సీపీ ఆదేశించారు. పోలీసులు ఆమెతోపాటు గౌరమ్మ కుటుంబసభ్యులందరినీ విచారించి, వివరాలు రాబట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.