మోసగాడు చిత్ర బృందం విశాఖలో పర్యటించింది. హీరో మంచు విష్ణుతో పాటు చిత్ర తారాగాణం నగరంలోని మెలోడీ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సందడి చేశారు. మోసగాడు చిత్రం నుంచి పది నిమిషాలు నిడివి గల వీడియోను విడుదల చేశారు. ఓ మంచి చిత్రం చూసిన అనుభూతి ప్రేక్షకుల్లో కలుగుతుందని మంచు విష్ణు చెప్పారు. మోహన్ బాబు పుట్టిన రోజైన మార్చి 19న చిత్రం విడుదల చేస్తున్నామన్నారు. అతని వెంట మరో హీరో నవదీప్ ఉన్నారు.
ఇదీ చదవండి: విశాఖ ఉక్కు పోరాట కమిటీ దీక్షలకు నటుడు శివాజీ సంఘీభావం