విశాఖ జిల్లాలో కరోనా కేసులు విజంభిస్తున్నందున మరిన్ని ప్రభుత్వ ఆసుపత్రులను కోవిడ్ ఆసుపత్రులుగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి, ప్రభుత్వ ఇ.ఎన్.టి ఆసుపత్రి, ప్రభుత్వ మానసిక ఆరోగ్య వైద్య శాల, రాణి చంద్రమణి దేవి ఆసుపత్రులను వైద్యుల బృందంతో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఈ ఆసుపత్రుల్లో కోవిడ్-19 చికిత్స కోసం పడకలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఆసుపత్రుల్లో అవసరమైన వసతి సౌకర్యాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు కలెక్టర్ పలు సూచనలను చేశారు.
ఇదీ చదవండి: కరోనాపై పోరు: 2021 నాటికైనా వ్యాక్సిన్ వచ్చేనా?