విశాఖ జిల్లా అనకాపల్లిలో శుక్రవారం ఒక్కరోజే 37 మందికి కరోనా నిర్థారణ అయ్యింది. కోట వీధిలోని ఒక కల్యాణ మండపంలో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నా 150 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 37 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఒకే రోజు ఇంత మందికి కరోనా సోకడంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. దీంతో పట్టణంలో కరోనా సోకిన వారి సంఖ్య 236కి చేరింది. కరోనా సోకిన వారిలో గవరపాలెం, నర్సింగరావు పేట, లోకవారి వీధి, ఏఎంసీ కాలనీ మార్టూరు డీఆర్టీ కాలనీ, రామాలయం వీధి ప్రాంతాల్లో ఉన్నారు. వీరిలో మహిళలను జేఎంజే క్వారంటైన్‌కు, పురుషులను రీబాక కేంద్రానికి తరలించారు.
ఇవీ చూడండి...