కారులో తరలిస్తున్న నగదును అనకాపల్లి పోలీసులు పట్టుకున్నారు. కాకినాడకు చెందిన నరేందర్ రెడ్డి విజయనగరం జిల్లా రామభద్రపురం నుంచి కారులో వస్తుండగా పోలీసులు తనిఖీ చేశారు. డిక్కీలో రూ.ఐదు లక్షల నగదు దొరికింది. ఎలాంటి ఆధారాలు చూపకపోడంతో నగదు స్వాధీనం చేసుకున్నట్లు అనకాపల్లి పట్టణ ఎస్సై ధనుంజయ్ తెలిపారు. నగదును రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు వివరించారు.
ఇదీ చదవండి: లబ్ధిదారులకు నచ్చిన రీతిలో ఇళ్ల నిర్మాణం: సీఎం జగన్