సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3ను రద్దు చేయడం పై మావోయిస్టు పార్టీ ఏవోబీ స్పెషల్ జోన్ కార్యదర్శి గణేష్ ఖండించారు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు. ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకే వంద శాతం రిజర్వేషన్లు ఉండాలని డిమాండ్ చేశారు. వారు ఇక్కడ ఉద్యోగాలు చేయడం వల్ల స్థానికంగా న్యాయం చేసే అవకాశం ఉంటుందన్నారు. మావోయిస్టు పార్టీ.. తమ ఉద్యమాలతో అనేక చట్టాలు రావడానికి కృషి చేసిందని గుర్తు చేశారు.
ఆ చట్టాలను తుంగలో తొక్కడం సరికాదన్నారు. జీవో నెంబర్ 3 రద్దుతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారని లేఖలో పేర్కొన్నారు. స్థానికంగా ఉద్యోగాల్లో ప్రమోషన్లు పొందాలన్నా.. జీవో నెంబర్ 3 తోనే సాధ్యమయ్యేదని గుర్తు చేశారు. వెంటనే జీవో నెంబర్ 3 రద్దు ఉపసంహరించుకోవాలి డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్టులో దీనిపై రివ్యూ పిటిషన్ వేయాలన్నారు.
గిరిజన ప్రాంతంలో 100% స్థానికులతో జీవో చట్టబద్ధం కావడానికి రాజకీయ పార్టీలు, సంఘాలు ఐక్యంగా పోరాడాలని లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: